🙏🙏🙏🙏🙏
ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.
🙏🙏🙏🙏🙏𝕻𝖗𝖆𝖘𝖆𝖉 𝕭𝖍𝖆𝖗𝖆𝖉𝖜𝖆𝖏:
_*🌹. కార్తీక మాసం 30 రోజులు - పూజించవలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం - ఫలితం 🌹*_
*📚. ప్రసాద్ భరద్వాజ*
*1వ రోజు*
నిషిద్ధములు :-
ఉల్లి , ఉసిరి , చద్ది , ఎంగిలి , చల్లని వస్తువులు
దానములు :-
నెయ్యి , బంగారం
పూజించాల్సిన దైవము :-
స్వథా అగ్ని
జపించాల్సిన మంత్రము :-
ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా
ఫలితము :-
తేజోవర్ధనము
*2వ రోజు*
నిషిద్ధములు :-
తరగబడిన వస్తువులు
దానములు :-
కలువపూలు , నూనె , ఉప్పు
పూజించాల్సిన దైవము :-
బ్రహ్మ
జపించాల్సిన మంత్రము :-
ఓం గీష్పతయే - విరించియే స్వాహా
ఫలితము :- మనః స్థిమితము
*3వ రోజు*
నిషిద్ధములు :-
ఉప్పు కలిసినవి , ఉసిరి
దానములు :- ఉప్పు
పూజించాల్సిన దైవము :- పార్వతి
జపించాల్సిన మంత్రము :-
ఓం పార్వత్యై - పరమేశ్వర్యై స్వాహా
ఫలితము :- శక్తి, సౌభాగ్యము
*4వ రోజు*
నిషిద్ధములు :- వంకాయ , ఉసిరి
దానములు :- నూనె , పెసరపప్పు
పూజించాల్సిన దైవము :- విఘ్నేశ్వరుడు
జపించాల్సిన
మంత్రము :-
ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- సద్బుద్ధి , కార్యసిద్ధి
*5వ రోజు*
నిషిద్ధములు :- పులుపుతో కూడినవి
దానములు :- స్వయంపాకం , విసనకర్ర
పూజించాల్సిన దైవము :- ఆదిశేషుడు
జపించాల్సిన మంత్రము :-
(మంత్రం అలభ్యం , ప్రాణాయామం చేయాలి)
ఫలితము :- కీర్తి
*6వ రోజు*
నిషిద్ధములు :- ఇష్టమైనవి , ఉసిరి
దానములు :- చిమ్మిలి
పూజించాల్సిన దైవము :- సుబ్రహ్మణ్యేశ్వరుడు
జపించాల్సిన
మంత్రము :-
ఓం సుం.బ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా
ఫలితము :- సర్వసిద్ధి, సత్సంతానం , జ్ఞానలబ్ధి
*7వ రోజు*
నిషిద్ధములు :- పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు :- పట్టుబట్టలు , గోధుమలు , బంగారం
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన మంత్రము :-
ఓం. భాం. భానవే స్వాహా
ఫలితము :- తేజస్సు, ఆరోగ్యం
*8 వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి , ఉసిరి , మద్యం , మాంసం
దానములు :- తోచినవి - యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దుర్గ
జపించాల్సిన మంత్రము :-
ఓం - చాముండాయై విచ్చే - స్వాహా
ఫలితము :- ధైర్యం, విజయం
*9వ రోజు*
నిషిద్ధములు :- నూనెతో కూడిన వస్తువులు , ఉసిరి
దానములు :- మీకు ఇష్టమైనవి పితృ తర్పణలు
పూజించాల్సిన దైవము :- అష్టవసువులు -
పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :-
ఓం అమృతాయ స్వాహా - పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మరక్షణ, సంతాన రక్షణ
*10వ రోజు*
నిషిద్ధములు :- గుమ్మడికాయ , నూనె , ఉసిరి
దానములు :- గుమ్మడికాయ , స్వయంపాకం , నూనె
పూజించాల్సిన దైవము :- దిగ్గజాలు
జపించాల్సిన మంత్రము :-
ఓం మహామదేభాయ స్వాహా
ఫలితము :- యశస్సు - ధనలబ్ధి
*11వ రోజు*
నిషిద్ధములు :- పులుపు , ఉసిరి
దానములు :- వీభూదిపండ్లు , దక్షిణ
పూజించాల్సిన దైవము :- శివుడు
జపించాల్సిన మంత్రము :-
ఓం రుద్రాయస్వాహా , ఓం నమశ్శివాయ
ఫలితము :- ధనప్రాప్తి , పదవీలబ్ధి
*12వ రోజు*
నిషిద్ధములు :- ఉప్పు , పులుపు , కారం , ఉసిరి
దానములు :- పరిమళద్రవ్యాలు , స్వయంపాకం , రాగి , దక్షిణ
పూజించాల్సిన దైవము :- భూదేవీసహిత శ్రీమహావిష్ణు లేక కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము :-
ఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- బంధవిముక్తి , జ్ఞానం , ధన ధాన్యాలు
*13వ రోజు*
నిషిద్ధములు :- రాత్రి భోజనం , ఉసిరి
దానములు :- మల్లె , జాజి వగైరా పూవులు , వనభోజనం
పూజించాల్సిన దైవము :- మన్మధుడు
జపించాల్సిన మంత్రము :-
ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహా
ఫలితము :- వీర్యవృద్ధి, సౌదర్యం
*14వ రోజు*
నిషిద్ధములు :- ఇష్టమైన వస్తువులు , ఉసిరి
దానములు :- నువ్వులు , ఇనుము , దున్నపోతు లేదా గేదె
పూజించాల్సిన దైవము :- యముడు
జపించాల్సిన మంత్రము :-
ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతినే స్వాహా
ఫలితము :- అకాలమృత్యువులు తొలగుట
*15వ రోజు*
నిషిద్ధములు :- తరగబడిన వస్తువులు
దానములు :- కలువపూలు , నూనె , ఉప్పు
జపించవలసిన మంత్రం :-
'ఓం శ్రీ తులసీథాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః'
*16వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి , ఉసిరి , చద్ది ,ఎంగిలి , చల్ల
దానములు :- నెయ్యి , సమిధలు , దక్షిణ , బంగారం
పూజించాల్సిన దైవము :- స్వాహా అగ్ని
జపించాల్సిన
మంత్రము :- ఓం స్వాహాపతయే జాతవేదసే నమః
ఫలితము :- వర్చస్సు , తేజస్సు , పవిత్రత
*17వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి , ఉసిరి , చద్ది , ఎంగిలి , చల్ల మరియు తరిగిన వస్తువులు
దానములు :- ఔషధాలు , ధనం
పూజించాల్సిన దైవము :- అశ్వినీ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అశ్విన్యౌవైద్యౌ తేనమః స్వాహా
ఫలితము :- సర్వవ్యాధీనివారణం ఆరోగ్యం
*18వ రోజు*
నిషిద్ధములు :- ఉసిరి
దానములు :- పులిహార , అట్లు , బెల్లం
పూజించాల్సిన దైవము :- గౌరి
జపించాల్సిన మంత్రము :- ఓం గగగగ గౌర్త్యె స్వాహా
ఫలితము :- అఖండ సౌభాగ్య ప్రాప్తి
Continues in page 2
🌹🌹
Cont... From page 1
*🌹. కార్తీక మాసం 30 రోజులు - పూజించవలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం - ఫలితం 🌹*
🌹 🌹
*19వ రోజు*
నిషిద్ధములు :- నెయ్యి , నూనె , మద్యం , మాంసం , మైధునం , ఉసిరి
దానములు :- నువ్వులు , కుడుములు
పూజించాల్సిన దైవము :- వినాయకుడు
జపించాల్సిన మంత్రము :- ఓం గం గణపతయే స్వాహా
ఫలితము :- విజయం , సర్వవిఘ్న నాశనం
*20వ రోజు*
నిషిద్ధములు :- పాలుతప్ప - తక్కినవి
దానములు :- గో , భూ , సువర్ణ దానాలు
పూజించాల్సిన దైవము :- నాగేంద్రుడు
జపించాల్సిన మంత్రము :- ఓం సర్పాయ మహాసర్పాయ దివ్యసర్వాయపాతుమాం
ఫలితము :- గర్భదోష పరిహరణం, సంతానసిద్ధి
*21వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి , ఉసిరి , ఉప్పు , పులుపు , కారం
దానములు :- యథాశక్తి సమస్త దానాలూ
పూజించాల్సిన దైవము :- కుమారస్వామి
జపించాల్సిన మంత్రము :- ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహా
ఫలితము :- సత్సంతానసిద్ధి , జ్ఞానం , దిగ్విజయం
*22వ రోజు*
నిషిద్ధములు :- పంటికి పనిచెప్పే పదార్ధాలు , ఉసిరి
దానములు :-k బంగారం , గోధుమలు , పట్టుబట్టలు
పూజించాల్సిన దైవము :- సూర్యుడు
జపించాల్సిన
మంత్రము :- ఓం సూం - సౌరయే స్వాహా , ఓం భాం - భాస్కరాయ స్వాహా
ఫలితము :- ఆయురారోగ్య తేజో బుద్ధులు.
*23వ రోజు*
నిషిద్ధములు :- ఉసిరి , తులసి
దానములు :- మంగళ ద్రవ్యాలు
పూజించాల్సిన దైవము :- అష్టమాతృకలు
జపించాల్సిన మంత్రము :-
ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా
ఫలితము :- మాతృరక్షణం , వశీకరణం
*24వ రోజు*
నిషిద్ధములు :- మద్యమాంస మైధునాలు , ఉసిరి
దానములు :- ఎర్రచీర , ఎర్ర రవికెలగుడ్డ , ఎర్రగాజులు , ఎర్రపువ్వులు
పూజించాల్సిన దైవము :- శ్రీ దుర్గ
జపించాల్సిన
మంత్రము :-
ఓం అరిషడ్వర్గవినాశిన్యై నమః శ్రీ దుర్గాయై స్వాహా
ఫలితము :- శక్తిసామర్ధ్యాలు , ధైర్యం , కార్య విజయం
*25వ రోజు*
నిషిద్ధములు :- పులుపు , చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు :- యథాశక్తి
పూజించాల్సిన దైవము :- దిక్వాలకులు
జపించాల్సిన మంత్రము :-
ఓం ఈశావాస్యాయ స్వాహా
ఫలితము :- అఖండకీర్తి , పదవీప్రాప్తి
*26వ రోజు*
నిషిద్ధములు :- సమస్త పదార్ధాలు
దానములు :- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము :- కుబేరుడు
జపించాల్సిన
మంత్రము :- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
ఫలితము :- ధనలబ్ది , లాటరీవిజయం , సిరిసంపదలభివృద్ధి
*27వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి , ఉసిరి , వంకాయ
దానములు :- ఉసిరి , వెండి , బంగారం , ధనం , దీపాలు
పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు
జపించాల్సిన
మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
ఫలితము :- మహాయోగం , రాజభోగం , మోక్షసిద్ధి
*28వ రోజు*
నిషిద్ధములు :- ఉల్లి , ఉసిరి , సొర , గుమ్మడి , వంకాయ
దానములు :- నువ్వులు , ఉసిరి
పూజించాల్సిన దైవము :- ధర్ముడు
జపించాల్సిన
మంత్రము :- ఓం ధర్మాయ , కర్మనాశాయ స్వాహా
ఫలితము :- దీర్ఘకాల వ్యాధీహరణం
*29వ రోజు*
నిషిద్ధములు :- పగటి ఆహారం , ఉసిరి
దానములు :- శివలింగం , వీభూది పండు , దక్షిణ , బంగారం
పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము :- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ,
ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్
ఫలితము :- అకాలమృత్యుహరణం , ఆయుర్వృద్ధి , ఆరోగ్యం , ఐశ్వర్యం
*30వ రోజు*
నిషిద్ధములు :- పగటి ఆహారం , ఉసిరి
దానములు :- నువ్వులు , తర్పణలు , ఉసిరి
పూజించాల్సిన దైవము :- సర్వదేవతలు , పితృ దేవతలు
జపించాల్సిన మంత్రము :- ఓం అమృతాయ స్వాహా మమసమస్త పితృదేవతాభ్యో నమః
ఫలితము :- ఆత్మస్థయిర్యం , కుటుంబక్షేమం.
🌹 🌹 🌹 🌹 🌹 *ధర్మసందేహాలు-సమాధానాలు*
==================
*ప్ర: శివారాధన వేదకాలానికే* *ఉందా? రుద్రుడూ, శివుడూ* *ఒకటేనా? వేరు వేరా?*
వేదకాలమంటూ ఒకటి ప్రత్యేకించి లేదు. వేదాలు అపౌరుషేయాలు. అనంత కాలానికి చెందినవి. ఈ పరమసత్యాన్ని జీర్ణించుకోలేక - వేదాలకీ కాలాన్ని నిర్ణయించాలనీ నానా అగచాట్లు పడ్డారు, పడుతున్నారు.
ఇక వేదాల్లో శివుని ప్రస్తావన పూర్ణంగా ఉంది.
'ఈశానస్సర్వవిద్యానాం ..... సదాశివోం, 'తన్మేమనశ్శివ సంకల్ప మస్తు', 'ఉమాసహాయం పరమేశ్వరం విభుం', 'అంబికా పతయే ఉమాపతయే', మొదలైన వేదోపనిషన్మంత్రాలెన్నో శివుని స్తుతిస్తున్నాయి..
రుద్రుడు, శివుడూ ఒకరే. ఇది వేదంలోనే ప్రస్తావించబడింది.
ఘోర రూపాలతో ఉన్న శివతత్త్వం రుద్రునిగా చెప్పబడింది.
"యాతే రుద్రశివా తనూ" - "నమస్సోమాయచ రుద్రాయచ.... నమశ్శంభవేచ మయోభవేచ, నమశ్శం కరాయచ మయస్కరాయచ, నమశ్శివాయ చ శివతరాయచ..." అని రుద్రనమక మంత్రాల్లో ప్రస్తావితాలు.
శివుడు లయకారకుడు.
ఈ లయ మూడు విధాలు -
1. సంహారం,
2. తిరోధానం (కనబడకుండా లీనమవడం),
3. అనుగ్రహం (మోక్షప్రదానం).
ఈ మూడూ చేసేది 'లయ' స్వరూపుడైన శివుడే.
ఒక్కొక్క పనికీ ఒక్కొక్క పేరు 1. రుద్ర, 2. మహేశ్వర, 3. సదాశివ అని.
ఈ మూడు ఒకే శివుని పేర్లు.
పరతత్త్వంలో లయమైతేనే మోక్షం, ఆనందం. దానినిచ్చేదీ ఆ పరతత్త్వమే.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అహంకారం*
🍁🍁🍁🍁
*మనిషి ఎంతటి విద్యను, సంపదను, ఐశ్వర్యాన్ని సంపాదించినా, ఎన్ని ఉన్నత పదవులను అలంకరించినా, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వారైనా జీవితంలో రాణించాలంటే ముందుగా ముఖ్యంగా వారిలో ఉండవలసినది తగినంత అణిగి మణిగి ఉండవలసిన అణకువ, వినయ విధేయత, సంయమనం, సంస్కారం, ఇంకా మేము గొప్ప వారిమనే భావనను మనసులోనికి రానీయకపోవటం. అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ ప్రేమానురాగాలను పంచడం వంటివి. ఇవే ప్రతి మనిషిని నిరహంకారిగా, ఉత్తములుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఉత్తమ లక్షణాలు..*
*మనుషుల మధ్య ఎక్కువగా మనస్పర్థలు, తగవులు రావడానికి కారణం ముఖ్యంగా "నేను, నాది, అంతా నాకే కావాలి " అనే ఈ అహంకారమే. ఈ అహంకారానికి చిన్న పెద్ద అనే వయస్సు, ధనం, కులం, మతం, ప్రాంతం, భాషా బేధాలు అనే ఇవేవీ దీనికి సంబంధం లేదు. కేవలం మనిషైతే చాలు, వారి మనసునిండా నిండుగా కొలువై వుంటుంది. ఇది సందర్భానుసారం బయటకు వచ్చి రభస చేసేస్తుంటుంది. తరువాత తీరికగా అయ్యో ఇలా ఎందుకు జరిగింది. నేను ఇలా ఉండకూడదని మనిషి మరలా తనలో తాను మదనపడడం కూడా జరుగుతూ ఉంటుంది. "మనిషిని అతలా కుతలం చేసి ఆడించేదీ " ఈ అహంకారమే..*
*ఈ అహంకారం కారణంగానే మనుషుల మధ్య గొడవలు జరిగేది, పెరిగేది. ఆ తర్వాత పశ్చాత్తాపం కలిగి గొడవపడిన వారిని కలుపుకు పోవడానికి ముందడుగు వేయనివ్వనిది కూడా ఈ ‘అహంకారమే’. ఎదుటి వారే ముందు నన్ను పలకరించాలనో, క్షమాపణ అడగాలనో, తాత్సారం కూడా చేయిస్తూ ఉంటుంది. మనిషి తనలోని అహంకారానికి ఆత్మాభిమానం అని మారుపేరు పెట్టుకున్నట్లే, ఎదుటి వారిలో ఉండే అహంకారానికి ‘గర్వం’ అనే పేరు పెడుతూ ఉంటారు..*
*చరిత్రను గమనిస్తే దుర్యోధనునిలో ఉన్న అహంకారం, అహంభావం వల్లనే పాండవులతో తగువులాట ఎక్కువైంది. పాండవుల కన్నా 'నేనే ' ఎక్కువ అన్న అహంభావాన్ని చూపించడానికి దుర్యోధనుడు ఎన్నోవిధాల కష్టపడ్డాడు. కాని ఎవరి ముందు నేను నా గొప్పను చూపిస్తున్నాను అన్న ప్రశ్న వేసుకొంటే, వారెవరూ నా అన్నదమ్ములే కదా అని అనుకొని ఉంటే గర్వం లేక అహం అనేది తొంగి చూడనే చూసి ఉండేదికాదు.*
*ఎందుకంటే ఈ సృష్టిలో చిన్న చీమ దగ్గరనుంచి చతుర్ముఖ బ్రహ్మ దాకా అందరికీ ఏదో ఒక విద్యలో నైపుణ్యం ఉండనే ఉంటుంది. ఎవరికి వారు వారి విద్యలో అంటే వారి బతుకుబాటలో, మనుగడలో నైపుణ్యాన్ని కల్గి ఉంటారు. వారు చేసిన పనిని మరొకరు నేర్చుకుని చేయగలరేమో కాని, వారికి స్వతహాగా వారి వృత్తిలో వారికి నైపుణ్యం కలిగివుండే ఆ గుణం అబ్బి ఉంటుంది..*
*దీనికి ఉదాహరణ పక్షులకు ఎగిరే గుణం వాటికి చిన్ననాటి నుంచి వస్తుంది. మానవులకు నడిచే గుణం అబ్బినట్లుగా పక్షికున్న ఎగిరే గుణం చేపకు లేదు కదా. కాని అతి చిన్న చేప అంత పెద్ద సముద్రపు నీటిని చూచి కూడా భయపడకుండా ఈదగలదు. అట్లానే ప్రతి మనిషిలోను ఏదో ఓ ప్రత్యేక గుణం ఉంటుంది. ఆ గుణం మిగిలిన వారికి లేకపోవచ్చు. కాని వారు అందులో ఏకాగ్రతతో నేర్చుకుంటే ఆ గుణంలోను నేర్పును సాధించే వీలు ఉంది..*
*ఎందుకంటే మానవులకు సాధ్యంకాని విద్య అంటూ ఏదీ ఉండదు. కాని మనకున్న గుణం వేరొకరి లేదు గదా అని ఆ గుణాన్ని చూచుకుని అహం పెంచుకుంటే ఒకనాడు బురదగుంటలో పడిపోయే ప్రమాదం ఉంది. గుణాలు సహజసిద్ధంగా రావాలి కాని పులిని చూచి నక్క వాతపెట్టుకున్నట్టు చేస్తే ఆ గుణాలు అభాసుపాలు చేస్తాయి అంతే కాని అవి మనకు అక్కరకు రానేరావు.*
*ఓసారి దుర్యోధనుడు నేనిచ్చిన అర్థరాజ్యంతోనే కదా కర్ణుడు దానకర్ణుడుగా పేరు తెచ్చుకున్నాడు. మరి నేను రారాజునై ఉండి కూడా ఆ పేరు ప్రఖ్యాతులు నాకెందుకు రావడం లేదు అని అనుకొని, తానుకూడా తన రాజప్రసాదంలో ఓ ధర్మగంట కట్టించాడట. ఎవరైనా సహాయం కోరి వచ్చి ఆ గంట మోగిస్తే వారి కోరికలు ఏవైనా సరే తీరుస్తాను అని దుర్యోధనుడు దండోరా వేయించాడట. కాని సహజంగానే దురహంకారి అయిన దుర్యోధనుని అహంకారాన్ని దించాలని ఆ భగవంతుడు అనుకొన్నాడు..*
*వెంటనే ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి తనకు యాగం చేయడానికి కట్టెలు కావాలని అడిగాడట. కట్టెలే కదా ఎన్నైనా తీసుకోమని చెప్పాడట. అందుకా విప్రుడు ఇపుడు కాదు నేను యఙ్ఞ యాగాదులు చేసేటపుడు ఇస్తే చాలు అన్నాడట. అదేవిధంగా కర్ణుడి దగ్గరకూడ మాట తీసుకొని వెళ్లిపోయిన ఆ బ్రాహ్మణుడు బాగా ముసురు పట్టి విపరీతమైన వర్షాలు కురిసే వానాకాలంలో వచ్చి తనకు కట్టెలు కావాలని దుర్యోధనుడిని అడుగగా, వానల వల్ల కట్టెలు దానం ఇవ్వలేక పోగా విసుక్కొంటూ, ఏమయ్యా నీకు బుద్దుందా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అడిగితే ఎలా, ఈ వర్షాలకు కట్టెలు ఏలా వస్తాయి. నీకు తెలియదా, ఇది వర్షాకాలం అని. నీకు కట్టెలు దానమివ్వడానికి ఇపుడు నాకు వీలు కానేకాదు. నీవు మరలా ఎప్పుడైనా రా అన్నాడట. కానీ ఆ విప్రుడు కర్ణుడి దగ్గరకు వెళ్లగా బయట ఎండు కట్టెలు దొరకక కర్ణుడు తన ఇంటి దూలాలు తీసి విప్రునికి దానంగా ఇచ్చాడట. అది తెలిసి దానకర్ణుడన్న పేరు కర్ణునికే సరియైనదని నిర్ణయంచుకుని దుర్యోధనుడు తన ఇంటి ముందున్న ఆ ధర్మగంటను తీసివేయించాడు..*
ఈ అహంకారం అనేది ఎవరికైనా చెడునే కలిగిస్తుంది. కాబట్టి దాన్ని దూరం చేసుకొని అందరిలో కలిసి, అందరినీ కలుపుకొని, అందరితో కలిసి మెలిసి ఇతరులకు ఉపయోగపడే ధర్మకార్యాలను చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.....🙏🙏
🍁🍁🍁🍁
🌸
No comments:
Post a Comment